: తాళి ఉంచుకోవాలా? తీసేయాలా? అన్నది వారిష్టం...ఆందోళన ఎందుకు?: ఖుష్బూ


ద్రవిడ కళగం నేతలు చేసిన తాళిబొట్టు వివాదం దేశంలోని సంప్రదాయవాదులను అట్టుడికించింది. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ నేత, నటి ఖుష్బూ స్పందించారు. తాళి ఉంచుకోవాలా? తీసేయాలా? అనేది వారి వ్యక్తిగత విషయమని ఆమె పేర్కొన్నారు. వారు వెళ్లి తాళి కట్టవద్దని ఇతరుల పెళ్లి ఆపలేదని ఆమె స్పష్టం చేశారు. తాళి గొప్పదని నమ్మేవారిని నమ్మవద్దని కూడా చెప్పలేదని, వారికి అది పురుష అహంకారంగా అనిపించిందని, దానిని వారు బయటికి చెప్పారని ఖుష్బూ తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో తాళి గొప్పదని చెప్పే హక్కు సంప్రదాయవాదులకు ఎలా ఉందో, దానిని ఇష్టం లేని వారు కూడా అలాగే చేయవచ్చని, వారికి ఆ స్వాతంత్ర్యం ఉందని ఖుష్బూ స్పష్టం చేశారు. అంత మాత్రాన వారిని అడ్డుకోవడం, నిరసనలు, ఆందోళనలు చేయడం సరికాదని ఖుష్బూ హిందూ సంఘాలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News