: నేపాల్ మాజీ ప్రధాని సూర్య బహదూర్ థాపా కన్నుమూత


నేపాల్ మాజీ ప్రధాని సూర్య బహదూర్ థాపా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. మార్చి 29 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న థాపా, లివర్, కడుపులో అంతర అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి కోలుకోలేకపోయారు. తన 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ముగ్గురు రాజుల ఆధ్వర్యంలో ఐదుసార్లు ప్రధానిగా పనిచేశారు. విదేశీ పర్యటనల్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూర్య బహదూర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News