: ఐపీఎల్ కు నేనింక అక్కర్లేదు: ప్రీతీ జింతా


ఐపీఎల్ కు మరింత పేరు, ప్రాచుర్యం తెచ్చిపెట్టేందుకు గత 8 సంవత్సరాలుగా ఎంతో కృషి చేశానని, ఇకపై ఐపీఎల్ కు తానింక అక్కర్లేదని భావిస్తున్నానని బాలీవుడ్ నటి, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింతా వ్యాఖ్యానించారు. త్వరలో నృత్యం ఆధారిత రియాలిటీ షో 'నాచ్ బలీయే'కు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆమె తన మనసులో మాటను వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని సినిమాల్లో కనిపించనున్నట్టు వివరించారు. "అప్పట్లో క్రికెట్ మీద మరింత దృష్టి పెట్టాలని అనిపించింది. కేవలం నటిస్తూ కూర్చోవాలని అనుకోకుండా, కొత్త రంగంలోకి దిగాను. కష్టపడ్డాను, క్రికెట్ తో మమేకమైనందుకు సంతోషపడ్డాను. ఇక ఇప్పుడు మాత్రం కేవలం ఆటను చూడటానికి మాత్రమే వస్తున్నారు. వ్యాపారం కూడా బాగా సాగుతోంది. మా టీం మంచి ప్రదర్శన కనబరుస్తోంది. దాంతో 'నాచ్ బలీయే'లో పాల్గొనడం, సినిమాల్లో నటించడం అనే ఆలోచన ఉత్సాహాన్ని ఇస్తోంది" అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News