: ఆ పెళ్లిళ్లు చేస్తే...పురోహితులు, క్యాటరర్స్, సప్లయర్స్ భరతం పడతారట


బాల్యవివాహాలు అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. బాల్యవివాహాలు నేరమని ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్నా అవి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని రూపుమాపేందుకు పెళ్లిళ్లు చేసే పురోహితులు, విందు సరఫరా చేసే క్యాటరర్స్, టెంట్లు, కుర్చీల సరఫరా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 21న అక్షయ తృతీయ, అలాగే మే 4న జ్యేష్ఠ పౌర్ణమి ఈ రెండు రోజుల్లో రాజస్థాన్ లో ఎక్కువ వివాహాలు జరుగుతాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితే వివాహం చేయవచ్చు. అయితే దీనిని కూడా బేఖాతరు చేస్తూ బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు రోజుల్లో బాల్యవివాహాలు భారీ సంఖ్యలో జరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా, పెళ్లిళ్లు మాత్రం ఆగకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News