: మళ్లీ సైనా ప్రపంచ నెంబర్ 1


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంది. చైనా క్రీడాకారిణి లి జురయ్ తాజాగా సింగపూర్ ఓపెన్ లో ఓడిపోవడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి చేరింది. దాంతో సైనా మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈరోజు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఈ విషయం వెల్లడైంది. ఈ నెల మొదట్లో ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించిన సైనా తొలిసారి నెంబర్ 1 స్థానానికి చేరింది. తరువాత మలేసియన్ ఓపెన్ సెమీస్ లో జురయ్ చేతిలో ఓడటంతో కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది. దాంతో ఇటీవల జరిగిన సింగపూర్ ఓపెన్ లో ఆడలేదు. ఇక మరో భారత క్రీడాకారిణి పీవీ సింధూ టాప్ టెన్ లో స్ధానం కోల్పోయి 12వ ర్యాంకులో నిలిచింది. అటు పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ 4, పారుపల్లి కశ్యప్ 14వ స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News