: పాలిటెక్నిక్ విద్యార్ధిగా కేసీఆర్...విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారట!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్... సీమాంధ్ర అంటేనే అంతెత్తున ఎగిరిపడతారు. అలాంటిది సీఎం పదవిలో ఉన్న ఆయన పాలిటెక్నిక్ చదవడమేంటి? అందునా సీమాంధ్రలోని విశాఖపట్నం కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడమేంటి? అనుకుంటున్నారు కదా. కేసీఆర్ హైదరాబాదులోనే సీఎంగా బిజీబిజీగా ఉన్నారు కాని, ఏపీ టెక్నికల్ శాఖే కాస్త మొద్దునిద్రలో జోగుతోంది. ఆ శాఖ అధికారుల నిర్వాకం కారణంగా విశాఖలో పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థి హాల్ టికెట్ పై కేసీఆర్ ఫొటో దర్శనమిచ్చింది. విశాఖ జిల్లా వరకూ అధికారులు పక్కాగానే వ్యవహరించినా, హైదరాబాదులోని సెంట్రల్ సర్వర్ వద్దకు వచ్చేసరికి గిరీశ్ అనే విద్యార్థి హాల్ టికెట్ పై కేసీఆర్ బొమ్మ వచ్చి చేరింది. పేరు మాత్రం గిరీశ్ దే అయినా, ఫొటో మాత్రం కేసీఆర్ ది. దీనిపై ఆందోళన చెందిన విద్యార్థిని బుజ్జగించిన అధికారులు, కేసీఆర్ ఫొటోపైనే గిరీశ్ ఫొటో అంటించి పరీక్షలకు అనుమతించారు.