: భారత్- కెనడా యురేనియం సరఫరా ఒప్పందం... సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్


సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న యురేనియం ఒప్పందాన్ని విదేశీ పర్యటనల్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించారు. భారత్-కెనడా మధ్య యురేనియం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ కు కెనడా పదేళ్లపాటు యురేనియంను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అటు ఈ ఒప్పందంపై కాంగ్రెస్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింగ్ మాట్లాడుతూ, "యూపీఏ హయాంలోని ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లి అణు శక్తి రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఏకీకరణ ప్రక్రియగా చేసినందుకు సంతోషిస్తున్నాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News