: మాటలు కాదు ఇక చేతలే అంటోన్న సోనియా
ఢిల్లీలో అత్యాచారానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ళ చిన్నారిని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈరోజు సాయంత్రం పరామర్శించారు. ఎయిమ్స్ లో వైద్యులను అడిగి చిన్నారి ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి దుశ్చర్యల పట్ల ఇక మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని సోనియా కటువుగా వ్యాఖ్యానించారు.