: ఎండాకాలంలో తిరుమలను వణికిస్తున్న చలి పులి!


ఎండలు మండిపోవాల్సిన కాలంలో అకాల వర్షాలు, ఉపరితల ద్రోణి, అతి తక్కువ ఎత్తులో మేఘాలు ఉండడం కారణంగా పుణ్యక్షేత్రం తిరుమల చలితో వణికిపోతోంది. కొండపై చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పొగమంచు దట్టంగా అలముకుంది. వాతావరణం చల్లగా ఉండగా, భక్తులు 'చలి పులి' ధాటికి ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు తిరుమల గిరులను పట్టి ఉండడంతో, ఘాట్‌ రోడ్డుపై వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు ముందు వెళుతున్న వాహనాలు, దారి కనిపించక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు నడకదారి భక్తులు సైతం చలితో వణుకుతున్నారు.

  • Loading...

More Telugu News