: మంత్రి సుజాత నడుపుతుండగా అదుపుతప్పిన ట్రాక్టర్‌... కార్యకర్తలు, నేతల పరుగులు


ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పడంతో కొన్ని క్షణాల పాటు అందరిలోనూ ఆందోళన నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ట్రాక్టర్‌ లను అందించే కార్యక్రమంలో మంత్రి సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా ట్రాక్టర్ నడపాలని నిర్ణయించుకున్నారు. స్టార్ట్ చేసి ముందుకు కదిలించారు. ట్రాక్టర్ నడపడంలో పెద్దగా అనుభవం లేకపోయిందో ఏమో, అది అదుపుతప్పి ఒక్కసారిగా కార్యకర్తలు, నేతలపైకి దూసుకొచ్చింది. దీంతో భయాందోళనలతో వారంతా పరుగులు పెట్టారు. ఆమెతో పాటు ట్రాక్టర్ ఎక్కిన దేశం నేతలు వెంటనే దాన్ని అదుపు చేసి బ్రేక్ వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News