: ఆప్ క్రమశిక్షణా కమిటీ చట్టవిరుద్ధంగా ఏర్పాటైంది: ప్రశాంత్ భూషణ్
తనపైన, యోగేంద్ర యాదవ్ పైన వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణా కమిటీ చట్టవిరుద్ధంగా ఏర్పాటైందని ఆ పార్టీ రెబల్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ నేతలైన వారిద్దరిపైన కేసు నమోదుకు ఆప్ సిఫారసు చేసిన ఒకరోజు తరువాత భూషణ్ ఈ మేరకు స్పందించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో తనపైన, యాదవ్ పైన తీవ్ర ఆరోపణలు చేసిన పంకజ్ గుప్తా, ఆశిష్ ఖేతన్ లతో ఏర్పాటైన ఆ కమిటీ ఉద్దేశాన్ని ప్రశ్నించారు.