: 2018 జూన్ నాటికల్లా రాజధాని తొలి దశ నిర్మాణం: మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం 2018 నాటికి మొదటిదశ పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం ప్రణాళిక అందజేసిందని, జపాన్ ప్రభుత్వం మైక్రోప్లాన్ రూపొందిస్తుందని గుంటూరులో చెప్పారు. ఈ జూన్ మొదటివారంలో రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తామని మంత్రులు వివరించారు.