: ఢిల్లీ చేరుకున్న రాహుల్ గాంధీ... కొడుకును చూసేందుకెళ్లిన సోనియా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ఞాతం వీడారు. రెండు నెలల పాటు సుదీర్ఘ సెలవు తీసుకున్న ఆయన నేటి ఉదయం ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్నారు. కొడుకు తిరిగి వచ్చాడన్న సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి రాహుల్ ఇంటికి వెళ్లారట. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు రెండు వారాల పాటు సెలవు తీసుకుని వెళ్లిన రాహుల్ గాంధీ, ఆ సెలవును పొడిగించుకుంటూ వెళ్లారు. రాహుల్ గాంధీ పర్యటనపై అటు బీజేపీ నుంచే కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నిన్ననే రాహుల్ ఢిల్లీ రానున్నారని ప్రచారం సాగినా, ఆయన నేటి ఉదయానికి గాని ఇంటికి చేరుకోలేదు.