: జగన్ పర్యటనతో పోలీసులకు తలనొప్పులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో జరుగుతున్న బస్సు యాత్ర రెండో రోజు విజయవాడలో ఈ ఉదయం ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా ప్రకాశం బ్యారేజ్, వెలిగొండ ప్రాజెక్టుల పరిశీలనకు ఆయన బయలుదేరారు. కాగా, జగన్ పర్యటన పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. బ్యారేజ్ పై పూర్తిగా ట్రాఫిక్ నిలిచింది. విజయవాడ దుర్గ గుడి సెంటర్ కు అన్ని వైపులా 2 నుంచి 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచింది. హైదరాబాద్ వైపు, కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు రోడ్డు, ఉండవల్లి, మంగళగిరి వైపు దారితీసే రహదార్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీసులు విఫలంకాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.