: మోదీకి 9 శతాబ్దాల కిందటి అపురూప కానుకనిచ్చిన కెనడా ప్రధాని
ఎప్పుడో, ఎవరో భారత్ నుంచి కెనడాకు తీసుకువెళ్లిన అపురూప శిలా ప్రతిమను ఆ దేశ ప్రధాని స్టీఫెన్ హార్పర్ తిరిగి ఇచ్చారు. కెనడా పర్యటనలో ఉన్న మోదీకి కానుకగా, 11వ శతాబ్దం నాటి ఖజురహో శిల్పాన్ని ఇచ్చారు. ఈ శిల్పం పేరు 'ప్యారెట్ లేడీ' (చిలక సుందరి) అట. నృత్యం చేస్తున్న ఒక సుందరి, వెనుకవైపు ఒక చిలక ఈ శిలపై చెక్కి ఉన్నాయి. 2011లో ఒక వ్యక్తి సరైన పత్రాలు లేకుండా ఈ శిల్పాన్ని తీసుకువెళ్తుండగా, కెనడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఇది కెనడియన్ పార్లమెంట్ లైబ్రరీలో ఉంది.