: అమెరికా, బ్రిటన్ ఇవ్వనిది కెనడా ఇచ్చింది: మోదీ
_9547.jpg)
2006లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ దేశంలో పర్యటించడానికి అమెరికా, బ్రిటన్ లు వీసా ఇచ్చేందుకు నిరాకరించిన సమయంలో కెనడా వీసాను ఇచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఎవరో పెద్దగా తెలియకుండానే పర్యటన ముగిసిపోయిందని 9 ఏళ్ల నాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు. కెనడా నుంచి ఇండియా రావడానికి 15 గంటల సమయం మాత్రమే పడుతుందని, కానీ ఒక భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 42 సంవత్సరాలు పట్టిందని ఆయన అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా, టొరంటోలో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆద్యంతం ఆహూతులు చప్పట్లతో ఉత్సాహపరుస్తుంటే మోదీ మరింత ఉత్సాహంగా ప్రసంగించారు. దాదాపు 12 సంవత్సరాలకు పైగా గుజరాత్ అభివృద్ధిలో కెనడా ప్రధాన భాగస్వామిగా నిలిచిందని కొనియాడారు. నిజమైన పేదలకు వంట గ్యాస్ రాయితీ అందాలన్న సదుద్దేశంతో రాయితీలను వదులుకోవాలని పిలుపు ఇస్తే, ఇప్పటివరకూ 4 లక్షల మందికిపైగా ముందుకు వచ్చారని తెలిపారు.