: సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ దే అగ్రస్థానం: చెంగ్దూలో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు


సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ అగ్రస్థానానికి ఎగబాకుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు, కొద్దిసేపటి క్రితం ఆ దేశ నగరం చెంగ్దూలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, సాఫ్ట్ వేర్ రంగంలో త్వరలోనే భారత్ అగ్రస్థానం చేరుకోనుందని చెప్పారు. ఒక్క సాఫ్ట్ వేర్ రంగంలోనే కాక భారత్, అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి సాధిస్తోందన్నారు. పెట్టుబడులకు భారత్ అనుకూలంగా ఉందని, అంతేకాక ఈ విషయంలో ఏపీ స్వర్గధామనని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News