: తెలుగోడి సత్తా... ఏడాదికి రూ.525 కోట్ల వేతనంతో టాప్ పెయిడ్ సీఈఓగా సత్య నాదెళ్ల!


ప్రపంచంలోనే సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల, తెలుగు నేల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు. తాజాగా ఆయన మరో అరుదైన రికార్డును సృష్టించారు. ప్రపంచ కార్పొరేట్ రంగంలో అత్యధిక వార్షిక వేతనం అందుకుంటున్న సీఈఓల్లో అగ్రస్థానానికి ఎగబాకారు. సీఈఓ పదవి చేపట్టి రెండేళ్లు కూడా గడవకముందే ఆయన ఈ ఘనతను సాధించడం గమనార్హం. ప్రస్తుతం సత్య నాదెళ్ల వార్షిక వేతనం 84.3 మిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో చూస్తే అక్షరాల రూ.525 కోట్లు. గతేడాది ఈ జాబితాలో ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ ఉండగా, తాజాగా సత్య నాదెళ్ల ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ఇక తాజా జాబితాలో భారత సంతతి మహిళ, పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ 19.08 మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో 19వ స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News