: ఢిల్లీ విజయ లక్ష్యం 166


పూణేలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కు మురళీ విజయ్ (19), సెహ్వాగ్ (47) శుభారంభం అందించారు. సాహా (39) రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు ఖాయమని సగటు అభిమాని భావించాడు. వీరు ముగ్గురూ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మిల్లర్ (5) విఫలమయ్యాడు, ఎన్నో ఆశలు మోసిన మ్యాక్స్ వెల్ (15)ను తాహిర్ కట్టడి చేశాడు. బెయిలీ (19)ని తాహిర్ ఆడనివ్వలేదు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్న అక్షర్ పటేల్ (13) ను తాహిర్ పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ (3), డుమిని (2) రాణించగా, వారికి మాథ్యూస్, మిశ్రా చెరోవికెట్ తీసి సహకరించారు. అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, మయాంఖ్ అగర్వాల్ (15) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News