: లోపం సరిచేసుకుంటాం: రోహిత్ శర్మ


వరుస ఓటములకు కారణం ఆత్మవిశ్వాసం లోపించడమేనని ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కోచ్ పాంటింగ్ తో పాటు పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ, మూడు మ్యాచుల్లో వరుసగా ఓడిపోవడం వెనుక ఏదో కారణముందని, దానిని సరిచేసుకోవడంపై దృష్టిపెడతామని అన్నాడు. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని, జట్టు విజయపథాన పయనిస్తుందని రోహిత్ వెల్లడించాడు. కాగా, రోహిత్ సారధ్యంలోని ముంబై జట్టు ఓటమిపాలు కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్, పాంటింగ్, షేన్ బాండ్ వంటి వారు కోచ్ లుగా వ్యవహరిస్తున్నా ఓటములు వెంటాడడం జట్టులో సమష్టితత్వం లోపించడమేనని అభిమానులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News