: సానియా మీర్జాను అభినందించిన రెహమాన్


ప్రపంచ టెన్నిస్ డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా మీర్జాను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'ఓకే బంగారం' సినిమా ఆడియో వేడుక సందర్భంగా హైదరాబాదు చేరుకున్న ఆయన, సానియా మీర్జాను ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ఆయన సానియాపై ట్వీట్ చేశారు. భారత జాతిని తలెత్తుకునేలా త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ ఉన్నత శిఖరాలపై నిలబెట్టిన మహిళ అని ఆయన సానియా మీర్జాను కొనియాడారు. అనంతరం ఆయన 'ఓకే బంగారం' ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణిరత్నం సినిమాలో పనిచేయడం సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. మొదటి నుంచి తామిద్దరిదీ మంచి జోడీగా పేరొందిందని రెహమాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News