: సాహా, వీరు బాదుడు...పంజాబ్ 100/1
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా పూణెలో జరుగుతున్న మ్యాచ్ లో వీరూ, సాహా దూకుడు చూపిస్తున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కీలక బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాదుడు మొదలుపెట్టాడు. తాహిర్ వేసిన 9వ ఓవర్ లో సెహ్వాగ్ ఓ సిక్సు, రెండు ఫోర్లు బాదాడు. సెహ్వాగ్ అండగా, వృద్ధిమాన్ సాహా వేగంగా ఆడాడు. ఈ క్రమంలో సాహా కేవలం 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ (19) శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. సెహ్వాగ్ (40) కి జతగా మిల్లర్ (2) ఆడుతున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మాథ్యూస్, మిశ్రా చెరో వికెట్ తీశారు.