: పేదరికం వెంటే ఆ మూడూ ఉన్నాయి: కైలాష్ సత్యార్థి


పేదరికం వెంటే నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ, అనారోగ్యం ఉంటాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, చట్టాలను పటిష్టం చేసి, పక్కాగా అమలు చేస్తే అన్నీ అంతమవుతాయని అన్నారు. పని చేసేందుకు భారత్ లో అద్భుతమైన వనరులున్నాయని చెప్పిన ఆయన, పనితగ్గ వేతనం లభించదని అన్నారు. వేతనాల్లో ఉన్న అసమతుల్యత ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని అన్నారు. స్థాయిని బట్టి కాక, పనిని బట్టి వేతనం అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దలకు ఉపాధి చూపితే పిల్లలు విద్యాలయాలకు తరలుతారని ఆయన పేర్కొన్నారు. స్కూళ్లలో కూడా సరైన, సమగ్ర, విలువలు కలిగిన విద్య అందించాలని, అలా జరిగితే వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ అంతమవుతాయని ఆయన తెలిపారు. పేదరికం వెంటే అనారోగ్యం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం దరిచేరుతుందని, దానిని బాగుచేసుకునే స్థోమత ఉండదని, అదే అన్నింటికంటే పెద్ద అనారోగ్యమని ఆయన తెలిపారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, చర్చలు ఫలవంతమైతే భవిష్యత్ బాగుంటుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News