: కష్టాలన్నీ విడాకులు తీసుకున్న మహిళలకే!
విడాకులు తీసుకున్న మహిళలు మనదేశంలో సామాజిక సమస్యలు ఎదుర్కొంటారన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడాకులు తీసుకున్న మహిళల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే మహిళల్లో గుండెపోటు సమస్య అధికంగా ఉంటుందని వారు వెల్లడించారు. మహిళల జీవితాల్లో విడాకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయని వారు తెలిపారు. అయితే విడాకులు కేవలం మహిళల్లోనే మానసిక ఒత్తిడి పెంచదని, పురుషుల్లో కూడా మానసిక ఒత్తిడి పెంచుతుందని వారు వెల్లడించారు. అయితే మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో గుండెపోటు ముప్పు తక్కువని పరిశోధకులు పేర్కోవడం విశేషం.