: అక్కడ నాలుగు జంతువుల్నే పెంచుకోవాలి!
నాలుగు కంటే ఎక్కువ జంతువులను పెంచుకోకూడదంటూ ఫిలిప్పీన్స్ లోని క్విజాన్ సిటీలో పెట్టిన నిబంధన జంతుప్రేమికుల ఆగ్రహం చవిచూస్తోంది. క్విజాన్ సిటీలోని మున్సిపాలిటీ జంతువులకు సంబంధించిన మార్పులు చేర్పులతో ఓ కొత్త ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం, ఒక ఇంట్లో శునకాలు, పిల్లులు కలిపి నాలుగుకు మించి ఉండకూడదు. ఈ ఆర్డినెన్స్ స్థానిక జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ కేంద్రాల ఆగ్రహం చవిచూసింది. ఇదేం ఆర్డినెన్స్ అంటూ మండిపడుతున్నారు. ఎక్కువ జంతువులు ఉంటే మున్సిపాలిటీకి వచ్చిన నష్టం ఏంటని జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ కేంద్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్ ను అమలు చేయవద్దంటూ వారు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఆర్డినెన్స్ పై మేయర్ సంతకం చేయాల్సి ఉంది.