: ముందు ఆంక్షలు ఎత్తివేయండి... ఆ తర్వాతే అణుఒప్పందం చేసుకుందాం: ఇరాన్
అణుఒప్పందాలు చేసుకుందామని ప్రపంచాన్ని ఊరించిన ఇరాన్ కీలక సమయంలో మెలికపెట్టింది. సమగ్ర అణుఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై అగ్రరాజ్యాలు విధించిన ఆంక్షలు ఎత్తివేస్తేనే, అణుఒప్పందానికి సమ్మతిస్తామని, ఆంక్షల విషయంలో స్పందించని పక్షంలో అణుఒప్పందం గురించి మర్చిపోవాలని రౌహనీ అన్నారు. తాము ప్రపంచ దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నామని, అంతే తప్ప అమెరికా కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రపంచంతో నిర్మాణాత్మక సంబంధాలను ఇరాన్ కోరుకుంటోంది తప్ప, ఏకపక్ష సంబంధాలను కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాలు ఇరాన్ తో స్విట్జర్లాండ్ లో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.