: ఏపీ బాధితుల పరిహార పథకం విధివిధానాలు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో వివిధ దుర్ఘటనలలో చనిపోయిన వారి కుటుంబాలకు, బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం పరిహార నిధి ఏర్పాటు చేసింది. నిధి నుంచి పరిహారం ఇచ్చేందుకు హోంశాఖకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బాధితుల పరిహార పథకం విధివిధానాలను ప్రకటించింది. 40 ఏళ్ల లోపు వ్యక్తులు చనిపోతే రూ.3 లక్షలు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు మరణిస్తే రూ.2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడినవారికి గరిష్ఠంగా రూ.లక్ష, వికలాంగులకు గరిష్ఠంగా రూ.2 లక్షలు, కనిష్ఠంగా రూ.25వేలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక యాసిడ్ దాడిలో గాయపడిన వారికి రూ.5 లక్షలు, మృతులకు రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. అత్యాచార బాధితులకు రూ.2లక్షలు పరిహారంగా ఇవ్వనున్నారు.