: ఎర్రచందనం స్మగ్లింగుకు పాల్పడుతున్న వారంతా వీరప్పన్ వారసులే: ఏపీ సీఎస్
శేషాచలం ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంశాఖకు ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారంతా వీరప్పన్ వారసులేనని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. వీరప్పన్ అనుచరుల దగ్గర పనిచేస్తున్న కూలీలే ఎన్ కౌంటర్ లో చనిపోయారని వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగును అరికట్టడానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు సహకరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎన్ హెచ్ ఆర్ సీ పరిశీలించనుంది.