: ట్యాంక్‌ బండ్ పరిసరాల్లో రేపటి నుంచి ఉచిత వైఫై


కాస్తంత సేదదీరేందుకు సాయంత్రాల సమయాన ట్యాంక్ బ్యాండ్, లుంబినీ పార్క్ ప్రాంతాలకు వెళ్లే హైదరాబాదీలకు మరింత కాలక్షేపం లభించనుంది. రేపటి నుంచి ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉచిత వైఫై సేవలు అందనున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉచిత వైఫై సేవలను ప్రారంభించనున్నారు. కాగా, ఇప్పటికే మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. త్వరలో నెక్లెస్ రోడ్ తో పాటు కూకట్ పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకూ వైఫై జోన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News