: ముస్లింలపై మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన


ముస్లింలను ఎంఐఎం రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందని ఆరోపిస్తూ ముస్లింలకు ఓటుహక్కు లేకుండా చేయాలని రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన, తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపించుకోవడం తప్పనిసరి చేయాలని శివసేన పేర్కొంది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి కూడా ఆలోచించాలని శివసేన తెలిపింది. కాగా, నిన్న అదే పార్టీకి చెందిన ఓ ఎంపీ ముస్లింలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకుంటేనే ఓటుహక్కు కల్పించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News