: వరుసగా 7వ సంవత్సరమూ మనమే ఫస్ట్... రూ. 4.34 లక్షల కోట్లు పంపిన ప్రవాస భారతీయులు


గడచిన 2014లో విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయుల నుంచి దేశంలోకి 70 బిలియన్ డాలర్లు (సుమారు 4.34 లక్షల కోట్లు) వచ్చాయి. విదేశాల నుంచి ప్రజలకు అందుతున్న నిధుల విషయంలో భారత్ తన ఆరేళ్ల రికార్డును కొనసాగించింది. వరల్డ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 200కు పైగా దేశాల్లో ఉన్న 2.1 కోట్ల మంది భారతీయులు ఇండియాలోని తమవారికి పంపించిన డబ్బుల మొత్తం ఇది. ఈ డబ్బుతో నాలుగు బులెట్ ట్రైన్ కారిడార్లు నిర్మించవచ్చు. 67 బొగ్గు క్షేత్రాలను వేలం వేసి కేంద్రం తన ఖజానాకు చేర్చే మొత్తం కన్నా ఇది అధికం. 2014లో భారత స్టాక్ మార్కెట్లో అన్ని కంపెనీలు కలిపి సమీకరించిన మొత్తం కన్నా ఇదే ఎక్కువ. గడచిన దశాబ్దకాలంలో భారత రెమిటెన్స్ మూడు రెట్లు పెరిగిందని ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు వివరించింది. అత్యధికంగా యూఏఈ నుంచి (12.63 బిలియన్ డాలర్లు)రాగా, ఆ తరువాత అమెరికా (11.18 బి. డాలర్లు), సౌదీ అరేబియా (10.84 బి. డాలర్లు)లు నిలిచాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం యూఎస్ఏ, మలేషియాల్లో 20 లక్షల మంది చొప్పున, యూఏఈలో 17.50 లక్షల మంది, సౌదీలో 17.8 లక్షల మంది భారతీయులు ఉండగా, యమన్ లో 1.11 లక్షలు, ఇజ్రాయిల్ లో 78 వేలు, ఇరాన్ లో 4 వేలు, ఇరాక్ లో 9 వేలు, జాంబియాలో 20,500, జింబాబ్వేలో 10,500 మంది భారతీయులు ఉన్నారు.

  • Loading...

More Telugu News