: జెరూసలేం పర్యటనకు కోర్టు అనుమతి కోరిన జగన్... సీబీఐ తీవ్ర అభ్యంతరం


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జెరూసలేం వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో అభ్యర్ధన పిటిషన్ దాఖలు చేశారు. జూన్ లేదా జులైలో పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని, వీసా పొందేందుకు తన పాస్ పోర్టు అప్పగించాలని కోరారు. దానిపై కోర్టు విచారణ సందర్భంగా, జెరూసలేం పర్యటనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ కేసు అభియోగాల నమోదుకు ముందు వాదనల స్థాయిలోనే ఉందని, ఎప్పుడూ ఏదో ఒక సాకు చూపుతూ విచారణను సాగదీస్తున్నారని పేర్కొంది. వేలకోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టి ఆయన సంపన్నుడయ్యారని సీబీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News