: పట్టిసీమ వద్దన్న జగన్ ద్రోహిగా మిగిలిపోతారు: లోకేష్
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మరోమారు నారా లోకేష్ స్పందించారు. పట్టిసీమ వద్దన్న జగన్ ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు తాగు, సాగు నీరు అందుతుందని చెప్పారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.