: అంబాజీపేటలో తన్నుకున్న ‘తెలుగు’ తమ్ముళ్లు!


ఓ వైపు టీడీపీ గ్రాఫ్ ఏపీలో నానాటికీ పైపైకి ఎగబాకుతుంటే, మరోవైపు ఆ పార్టీ కార్యకర్తల మధ్య గతంలోలానే విభేదాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. అంబాజీపేటలో నేటి ఉదయం జరిగిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సమావేశంలో భాగంగా రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ తమ్ముళ్లు వాగ్వాదానికి దిగడంతో పాటు పరస్పర దాడులు చేసుకున్నారు. కుర్చీలనెత్తుకుని మరీ గొడవకు దిగారు. దీంతో వారిని సముదాయించేందుకు పార్టీ నేతలు నానా పాట్లు పడాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News