: 'మా' ఫలితాలపై కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తా: ఓ.కల్యాణ్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై సిటీ సివిల్ కోర్టు వెల్లడించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని నటుడు ఓ.కల్యాణ్ తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ఆయన, 'మా' ఎన్నికల ప్రక్రియ అంతా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని అన్నారు. అంతకుముందు ఈ ఎన్నికలపై అతను వేసిన పిటిషన్ ను ఈరోజు న్యాయస్థానం కొట్టివేసింది. అంతేగాక కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ రూ.10వేల జరిమానా కూడా విధించింది. ఎప్పుడైనా ఫలితాలు ప్రకటించుకోవచ్చని, అది ఎన్నికల అధికారి నిర్ణయమని తెలిపింది.

  • Loading...

More Telugu News