: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కొకైన్ కలకలం... రూ.65 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి ఉదయం కొకైన్ కలకలం రేగింది. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మత్తు పదార్ధం కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1.3 కిలోల కొకైన్ ను తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు, మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తిని విచారిస్తున్న అధికారులు ఈ అక్రమ రవాణాకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అరెస్టయిన వ్యక్తి జాతీయత కాని, ఇతర వివరాలు కాని వెల్లడి కాలేదు.