: డీకే అరుణ భర్తకు హైకోర్టులో చుక్కెదురు... రూ.33 కోట్ల జరిమానా వడ్డన!


మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన నిర్వహిస్తున్న క్వారీల్లో పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను విధించింది. అంతేకాక భరతసింహారెడ్డి నుంచి జరిమానాను మీరు వసూలు చేస్తారా?, లేక మమ్మల్నే వసూలు చేసుకొమ్మంటారా? అని కూడా కోర్టు అధికారులను ప్రశ్నించింది. మహబూబ్ నగర్ జిల్లాలో భరతసింహారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఇప్పటికే పలుమార్లు విచారించిన కోర్టు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న భరతసింహారెడ్డి కుటుంబ సభ్యుల పిటిషన్ ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News