: ధోనీని చూసి నేర్చుకో: కోహ్లీకి స్టీవ్ వా సలహా
భారత జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి ఉందని, ఎప్పుడు ఎలా నడచుకోవాలో మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలని ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా సలహా ఇచ్చారు. కోహ్లీ ఇప్పటికే పరిణతి చెందాడని వెల్లడించిన ఆయన, కొన్ని వ్యక్తిగత విషయాల కారణంగా, ఆయన తనలోని అసహనాన్ని, చిరాకును, భావోద్వేగాలనూ ఎక్కువగా బయటపెట్టినట్లు కనిపించదని స్టీవ్ వా అన్నారు. ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోని ధోనీని ఫాలో అయితే కోహ్లీ మరింతకాలం పాటు అలరించగలుగుతాడని అన్నాడు. అందుకోసం ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.