: బెంబేలెత్తిస్తున్న బర్డ్ ఫ్లూ... నాలుగు రోజులు చికెన్, కోడిగుడ్లు కొనవద్దు: జీహెచ్‌ఎంసీ సూచన
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కోళ్ళపై బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా, కనీసం నాలుగు రోజులపాటు జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని ప్రజలు చికెన్, కోడిగుడ్లు కొనుగోలు చేయవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ పరిధిలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నేడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సర్కిల్ పరిధిలోని సాహెబ్‌నగర్, హయత్‌నగర్, వనస్థలిపురం తదితర డివిజన్లలో బర్డ్ ఫ్లూ ప్రభావం మరింత అధికమని, దుకాణదారులు కూడా చికెన్, కోడిగుడ్లను అమ్మరాదని హెచ్చరించింది. అమ్మితే చర్యలు తీసుకుంటామని వివరించింది.