: ఆల్టోలో వెళుతూ స్కార్పియోను ఓవర్ టేక్ చేసినందుకు మహిళా జర్నలిస్టుపై దాడి
దేశ రాజధానిలో ఒక మహిళా జర్నలిస్టుపై ఈ ఉదయం దాడి జరిగింది. మారుతి ఆల్టో కారులో ఆఫీసుకు బయలుదేరిన ఆమె మార్గమధ్యంలో ఒక స్కార్పియో వాహనాన్ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన స్కార్పియోలోని ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడికి దిగి దుర్భాషలాడుతూ కొట్టారు. జర్నలిస్టు తేరుకునేలోపే వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా, గతవారం జరిగిన మరో ఘటనలో బైకుపై వెళుతూ, కారును వెనక నుంచి తాకినందుకు ద్విచక్రవాహనదారుడిని తీవ్రంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే.