: అమ్మాయిలను ఎలా ఎరగా వేస్తారంటే... క్రికెటర్లకు బీసీసీఐ క్లాస్


క్రికెటర్లను వశపరచుకొని మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలు ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలుపుతూ, అందులో ఇరుక్కోవద్దని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు వివరించింది. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందో తెలిపింది. అందమైన భామలను ఎంపిక చేసి అభిమానుల రూపంలో పంపి, వారిద్వారా ఎంచుకున్న ఆటగాడిని పరిచయం చేసుకుంటారని, వారిద్దరి పరిచయాన్ని దగ్గరి సంబంధంగా మార్చేందుకు తొలుత ఫోన్ సందేశాలు, ఆపై సంభాషణలు, డిన్నర్లు, డేటింగ్ వంటి ఎత్తులు వేస్తారని వివరించారు. బంధం బలపడిందని భావించిన తరువాత రంగంలోకి దిగే బుకీలు, అమ్మాయితో సన్నిహితంగా ఉన్న చిత్రాలను, వీడియోలనూ పంపి లోబరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయం అత్యంత కీలకమని, పై అధికారులకు ఫిర్యాదు చేయడమా లేక బుకీలతో చేతులు కలపడమా ఆటగాడు తేల్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఒకసారి బుకీలు, ఫిక్సర్ల వలలో పడితే మాత్రం వెనక్కురావడం అంత సులభం కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News