: భారత్ కంటే... పాక్, బంగ్లాదేశ్ లే నయమట!: హైకోర్టు చీఫ్ జస్టిస్ గుప్తా వ్యాఖ్య


భారత్ కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లే నయమని సాక్షాత్తు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వ్యాఖ్యానించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఆయన చెప్పిన కారణం వింటే మాత్రం నిజమే సుమా అనుకోకుండా ఉండలేము. దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసుల గుట్టలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీనికి కారణంగా అవసరమైన మేర న్యాయమూర్తుల పోస్టులతో పాటు న్యాయవాదుల పోస్టులూ భర్తీ కాకపోవడమేనట. అసలు న్యాయ శాఖకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు జీడీపీలో 1 శాతం కన్నా తక్కువేనట. అదే పాక్, బంగ్లాదేశ్ లలో మనకన్నా కాస్త ఎక్కువగానే నిధులు న్యాయశాఖకు విడుదలవుతున్నాయని జస్టిస్ గుప్తా చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రస్తుతమున్న న్యాయమూర్తుల పదవులను మరో పది శాతం పెంచితే, అసలు దేశంలో పెండింగ్ కేసులనేవే ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News