: ఫాంహౌస్ లో అశ్లీల నృత్యాలు... యువతీ యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాదును రేవ్ పార్టీల సంస్కృతి వీడటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా పార్టీల్లో యువతీ యువకులు అశ్లీల నృత్యాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం పంచాయతీ పరిధిలోని ఓ ఫాంహౌస్ లో నిన్న రాత్రి జరిగిన ఈ తరహా పార్టీలో ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని డబీర్ పురాకు చెందిన ఇమ్రాన్ ఖురేషీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఖురేషీతో పాటు అతడి ఆరుగురు మిత్రులు, అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.