: ఇదేం సభ్యత్వ నమోదు... టీ కాంగ్రెస్ పై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఆగ్రహం


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దేశించిన లక్ష్యంలో సగం మేర కూడా సభ్యత్వాలు నమోదు చేయించలేదని టీ కాంగ్ కార్యవర్గంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర కుంతియా చిందులు తొక్కారు. నిన్న గాంధీభవన్ లో పార్టీ సభ్యత్వ నమోదుపై జరిగిన సమీక్ష సందర్భంగా టీ కాంగ్ ముఖ్య నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, డీఎస్, పొన్నాలలపై కుంతియా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన సోనియా గాంధీ, కొత్త రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై భారీ అంచనాలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అధినేత్రి అంచనాలకు విరుద్ధంగా సభ్యత్వ నమోదు సాగుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 25 లక్షల పార్టీ సభ్యత్వాలను అధిష్ఠానం నిర్దేశిస్తే, ఇప్పటిదాకా సగం కూడా చేయలేకపోవడమేమిటని ఆయన నిలదీశారు. దీంతో టీ కాంగ్ నేతలు నోరు తెరిచేందుకు కూడా సాహసించలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News