: హైదరాబాదు చేరుకున్న సానియా మీర్జా... ఘన స్వాగతం పలికిన అభిమానులు!


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకుంది. టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించిన తర్వాత తొలిసారిగా హైదరాబాదులో అడుగుపెట్టిన సానియాకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబ సభ్యులతో పాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సానియాకు స్వాగతం పలికింది. టెన్నిస్ మాజీ ప్రపంచ నెంబర్ వన్ మార్టినా హింగిస్ తో కలిసిన తర్వాత డబుల్స్ లో వరుస విజయాలు సాధించిన సానియా, డబుల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News