: కేంద్ర మంత్రిపై యూపీ కోర్టు అరెస్ట్ వారెంట్... కోర్టుకు గైర్హాజరైన ఫలితమేనట!


కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్ రాజ్ మిశ్రాపై ఉత్తర ప్రదేశ్ లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించి నిన్న జరిగిన విచారణకు గైర్హాజరైన కల్ రాజ్ మిశ్రాను అరెస్ట్ చేసి తనముందు హాజరుపరచాలంటూ కోర్టు న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని దియోరా నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన కల్ రాజ్ మిశ్రా, నరేంద్ర మోదీ సర్కారులో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2009లో జరిగిన ఎన్నికల సందర్భంగా మిశ్రా ఎన్నికల నియమావళిని అతిక్రమించారని కేసు నమోదైంది. నిన్న జరిగిన ఈ కేసు విచారణకు మిశ్రా హాజరుకాలేదు. దీంతో ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News