: లోకేశ్ యాత్రలో జేబు దొంగల చేతివాటం... కార్యకర్త జేబు నుంచి రూ.లక్ష మాయం


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్ చేపట్టిన యాత్రలో జేబు దొంగలు స్వైరవిహారం చేశారు. రాయలసీమలో కార్యకర్తల సంక్షేమ యాత్రను తన తండ్రి నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో నేటి ఉదయం ప్రారంభించిన లోకేశ్, పలమనేరు మీదుగా పుంగనూరు చేరుకున్నారు. పుంగనూరులో ఆయన యాత్రకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు యాత్రలో పాలుపంచుకున్నారు. ఇదే అదనుగా యాత్రలో చొరబడ్డ జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పార్టీ కార్యకర్త రాజశేఖర్ జేబులోని రూ.లక్షను కాజేశారు. డబ్బు మాయమైన విషయాన్ని గమనించిన రాజశేఖర్, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News