: భారత ఐస్ హాకీ జట్టుకు గౌతీ ఆర్థిక బాసట... రూ.4 లక్షల వితరణ!


టీమిండియా మాజీ సభ్యుడు, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతం గంబీర్ ఔదార్యం ప్రదర్శించాడు. కువైట్ లో ఈ నెలాఖరులో జరిగే ఐస్ హాకీ ఆసియా చాంపియన్ షిప్ కు వెళ్లేందుకు డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న భారత ఐస్ హాకీ జట్టుకు అతడు బాసటగా నిలిచాడు. కువైట్ పర్యటనకు సంబంధించి ఐస్ హాకీ జట్టుకు రూ.4 లక్షలను అందజేశాడు. కువైట్ వెళ్లేందుకు సిద్ధమైన ఐస్ హాకీ జట్టు ఆర్థిక వనరులు లేక నానా అవస్థలు పడుతోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా ఐస్ హాకీ జట్టుకు ఆర్థికంగా నిధులు సమకూర్చడంలో ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆ జట్టు సభ్యులు సోషల్ మీడియా ద్వారా బిక్షాటనకు దిగారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న గౌతీ, ఆ జట్టుకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రీడా జట్టును ఆదుకోవాలన్న నైతిక బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతీ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News