: అవి సొరంగాలు కావట... పాత గదులేనంటున్న హైదరాబాదు పోలీసు బాసులు!


హైదరాబాదు నగరంలోని చారిత్రక కట్టడం చార్మినార్ సమీపంలో రెండు రోజుల క్రితం వెలుగుచూసిన సొరంగాలు, అసలు సొరంగాలే కావట. పోలీస్ క్వార్టర్ల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా, రెండు సొరంగాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. సొరంగాలు బయటపడిన నేపథ్యంలో అక్కడి పనులను పోలీసులు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా వాటిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గతంలో అసంపూర్తిగా జరిగిన నిర్మాణాలు కాలక్రమేణా భూమి లోపలికి కుంగిపోయాయని, ఆ భవనాల గోడలే ప్రస్తుతం సొరంగాల మాదిరిగా కనిపించాయని తేల్చారు. దీంతో సదరు ప్రాంతంలో పోలీసు క్వార్టర్ల నిర్మాణం కొనసాగుతుందని పోలీసుల ఉన్నతాధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News