: ఐపీఎల్ టీమ్ బస్సులో ప్రియుడితో పాటు ప్రయాణించిన అనుష్క!


ప్రపంచకప్ సమయంలో దారుణమైన విమర్శలు ఎదుర్కొన్న ప్రేమ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. అందుకే కోహ్లీ ఎక్కడికెళ్లినా అనుష్క వెనకాలే వెళుతోంది. తాజాగా ఐపీఎల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో డాన్స్ చేసిన అనుష్క, ఈ సీజన్ అంతా కోహ్లీతోనే కలిసి తిరుగుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వీక్షించిన అమ్మడు కోహ్లీకి చీర్స్ చెప్పి ఉత్సాహపరిచింది. అంతేకాదు, వాళ్ల టీమ్ బస్సు ఎక్కి ప్రయాణించిందట. బస్సులో కోహ్లీ, అనుష్క పక్కపక్క సీట్లలో కూర్చొన్నారట. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఇద్దరూ తమ ఫోన్లతో తెగ బిజీగా కనిపిస్తున్నారు. గతంలో రహస్యంగా విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.... ప్రేమ విషయం బహిరంగమయ్యాక ఇప్పుడు పబ్లిగ్గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకాడడంలేదు.

  • Loading...

More Telugu News